కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ రద్దు
మహారాణిపేట: ‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టే కార్యక్రమంలో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారు పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అందుబాటులో ఉండరని కలెక్టర్ పేర్కొన్నారు.
పోలీసు పీజీఆర్‌ఎస్..
అల్లిపురం: సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ రద్దు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అందుబాటులో 5 అంబులెన్సులు


