రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి జీఆర్పీ తెలిపిన వివరాలివి. గురువారం సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ 8వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తుండగా.. 7వ నంబర్ ప్లాట్‌ఫాం ట్రాక్‌పై నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రైలు కింద పడ్డాడు. దీంతో శరీరం రెండు భాగాలు గా విడిపోయి అతను అక్కడికక్కడే మరణించాడు. అతను స్కై బ్లూ ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ముదురు సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, అతని గురించి తెలిసినవారు గవర్నమెంట్ రైల్వే పోలీసులను స్వయంగా గానీ లేదా 86398 65434/94406 27547 నంబర్లలో గానీ సంప్రదించాలని ఎస్‌ఐ రామారావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


