లభించని గల్లంతైన యువకుల ఆచూకీ
పెదగంట్యాడ: యారాడ తీరంలో గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది స్నేహితులు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సరదాగా గడిపేందుకు యారాడ తీరానికి వచ్చారు. సముద్రంలో దిగిన వారిలో బొత్స పవన్ కుమార్, పగడాల గణేష్ అలల ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారి జాడ కోసం మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. మంగళవారం కోస్ట్ గార్డ్స్ సిబ్బంది, న్యూ పోర్ట్ సీఐ కామేశ్వరరావు గాలింపు బోటుతో, ఎస్‌ఐ శ్యామ్ సుందర్ డ్రోన్ల సాయంతో తీరం వెంబడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.


