షాడో ఫ్యాక్స్ కంపెనీలో కార్మికుడి మృతి
గాజువాక : స్థానిక ఆటోనగర్‌లోని షాడో ఫ్యాక్స్ టెక్నాలజీ షిప్‌మెంట్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న ఎల్లబిల్లి ఆకాష్ షిప్‌మెంట్ బెల్టు వద్ద జారిపడి మృతి చెందాడు. బెల్టువద్ద జారిపడ్డ ఆకాష్‌ను సహచర సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించినట్టు పోలీసులు తెలిపారు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ కంపెనీ షిప్‌మెంట్ బెల్టువద్ద ఎలక్ట్రికల్ షాక్ తగులుతుందని కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్‌కు ఎలక్ట్రికల్ షాక్ తగిలిందా, గుండెపోటుకు గురయ్యాడా అనే విషయాన్ని పోస్టుమార్టం నివేదిక తరువాత తెలుస్తుందని సీఐ పార్థసారధి తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ కంపెనీలో చిన్నపిల్లలు కూడా పని చేస్తున్నారని కార్మికులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


