దీపావళిలో అపశ్రుతి
మహారాణిపేట/మద్దిలపాలెం: దీపావళి సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకున్నాయి. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో సహా మొత్తం 18 మంది గాయపడ్డారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పర్యవేక్షణలో, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మోహనరావు గాయపడ్డవారికి చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడ్డిన వారి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ మోహనరావు తెలిపారు. వివరాలివి. నగరంలో నివసిస్తున్న విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు (14) చేతిలో మతాబులు పేలడం వల్ల చేతి వేళ్లు తెగి పడిపొయాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం రాళ్లపల్లికి చెందిన ఇంజిరాపు సూర్యనారాయణ (64) 37 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. క్రాకర్ పేలుడు కారణంగా 14 ఏళ్ల బాలుడు పి. బాలచంద్రరావు చేతికి గాయమైంది. అలాగే సోమవారం అర్ధరాత్రి ఏయూ విద్యార్థులు జానకీరాం(ఆంత్రోపాలజీ), సాయికృష్ణ, హరిక్రిష్ణ (పాలిటిక్స్ అండ్ అడ్మిస్ట్రేషన్) టపాసులు కాల్చేందుకు బీచ్‌రోడ్‌కు వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో బీచ్‌రోడ్‌లోని కోకోనాట్ ప్లాంట్ వద్ద టపాసులు కాలుస్తుండగా.. చేతిలో ఉన్న టపాసులకు నిప్పు రవ్వలు తగలడంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో జానకీరాంకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి అదుపులో ఉంది. సాయికృష్ణ, హరికృష్ణలకు ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. ఏయూ అధికారులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. స్వల్పంగా గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ మోహనరావు తెలిపారు.
దీపావళిలో అపశ్రుతి
దీపావళిలో అపశ్రుతి
దీపావళిలో అపశ్రుతి


