సిరోభూషణం సుజాతకు అరుదైన అవకాశం
విశాఖ సిటీ : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్)లో సీనియర్ మహిళా ఉద్యోగిగా ఉన్న సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ సిరోభూషణం సుజాతకు అరుదైన అవకాశం లభించింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద డీసీఐఎల్ డ్రెడ్జ్ గోదావరి నౌకను ప్రారంభించే గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు, డీసీఐఎల్ చైర్మన్ ఎం.అంగముత్తుతోపాటు సుజాత పాల్గొన్నారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు, సీనియర్ ఉద్యోగుల సేవలను గౌరవించేందుకు సుజాతకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఆమె చైర్మన్, ఇతర సీనియర్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.


