● క్రాకర్స్.. స్వీట్స్
శ్రీహరిపురంలోని శ్రీనివాస్ స్వీట్ స్టాల్ వినూత్నంగా ఆలోచించింది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా అచ్చం బాణసంచా ఆకారంలో స్వీట్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం ఉదయం నుంచే నార్త్ ఇండియన్స్ మాత్రమే కాక, స్థానిక సౌత్ ఇండియన్ చిన్నారులు, పెద్దలు ఈ విభిన్నమైన స్వీట్లను చూసి ముచ్చట పడి కొనుగోలు చేస్తున్నారు. పాల కోవాతో తయారు చేసిన భూచక్రాలు, చిచ్చు బుడ్లు, విష్ణు చక్రాలు, బాంబులు, కాకర పువ్వొత్తులు వంటి రకరకాల ఆకారాల్లోని స్వీట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ స్వీట్లకు దీపావళి క్రాకర్ రూపాన్ని ఇవ్వడం ద్వారా శ్రీనివాస్ స్వీట్ స్టాల్ యజమాని పండుగ వాతావరణాన్ని మరింత పెంచారు. – మల్కాపురం
● క్రాకర్స్.. స్వీట్స్


