ఆకట్టుకున్న క్రీడా పరికరాల ప్రదర్శన
విశాఖ స్పోర్ట్స్: సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌లో భాగంగా శుక్రవారం డీఎస్‌ఏ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాలులో క్రీడా పరికరాలు, హస్తకళల ప్రదర్శన, విక్రయాలను ఏర్పాటు చేశారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, సెట్విస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను క్రీడాకారులు, నగర ప్రజలు వీక్షించారు. ముఖ్యంగా క్రీడా పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సందర్శించి అందుబాటులో ఉన్న వస్తువుల నాణ్యతను పరిశీలించారు. జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, సెట్విస్ సీఈవో కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.


