
జోన్–1 ఈఈగా శ్రీనివాసరావు బాధ్యతలు
సాక్షి, విశాఖపట్నం : ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ జోన్–1 డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పోలాకి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సర్కిల్ కార్యాలయంలో ఈఈగా పనిచేసిన సింహాచలం నాయుడు జోన్–3కి బదిలీ అయ్యారు. తర్వాత ఇన్‌చార్జ్‌గా వేణుగోపాల్ వ్యవహరించారు. ఆయన స్థానంలో శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. పాతనగరం, వాల్తేర్, దొండపర్తి, సీతమ్మధార తదితర ప్రాంతాలకు చెందిన ఈపీడీసీఎల్ అధికారులు, విద్యుత్ సంఘాల నాయకులు ఆయన్ని అభినందించారు. డీజీఎం కృష్ణకుమారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్.సుమన్, శిరీషా గాయత్రి, జ్యోతి, విద్యాసాగర్, ఏఈలు, జేఈలు సిబ్బంది పాల్గొన్నారు.