
ఎస్సీ కమిషన్ సభ్యుడికి వినతి
తమకు న్యాయం చేయాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వాడపల్లి దయాకర్‌ను ఏయూ అతిథి అధ్యాపకులు వేడుకున్నారు. సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన్ని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం జరిగి 6 నెలలు గడవక ముందే మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని, తమకు రెన్యువల్/రివ్యూస్ విధానం అమలు చేసేలా యూనివర్సిటీ అధికారులను ఆదేశించాలని కోరారు. దయాకర్‌ను కలిసిన వారిలో అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.సురేష్ మీనన్, డా.తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, డా.రామ్, తదితరులున్నారు.