
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు
మహారాణిపేట: ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అందిన ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారి లేదా ఉద్యోగి తప్పకుండా ఫిర్యాదుదారుతో ఫోన్‌లో సంప్రదించి, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి బుధవారం, గురువారం తాను స్వయంగా ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి మాట్లాడుతానని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతులను వెంటనే లాగిన్‌లో ఓపెన్ చేసి, కాలపరిమితిలోగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు వివిధ సమస్యలపై 348 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 122, జీవీఎంసీకి 76, పోలీస్ శాఖకు 14, ఇతర శాఖలకు 136 ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్. భవానీ శంకర్, సీసీపీ ధనుంజయరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీసీ ఇవ్వకుండా ఇబ్బందులు
బోయపాలెం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో నా కుమార్తె డి.కృపారాణి ఇంటర్ రెండేళ్లకు పూర్తి ఫీజు చెల్లించాం. చదువు పూర్తయినా టీసీ ఇవ్వడానికి యాజమా న్యం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది. నా కుమార్తె ఉన్నత చదువుకు అడ్డంకి కలుగుతుంది. తక్షణం టీసీ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
– డి.గౌరీశంకర్, బోయపాలెం
కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 348 వినతులు

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు