కోరాపుట్‌ వరకే కిరండూల్‌ రైళ్లు | - | Sakshi
Sakshi News home page

కోరాపుట్‌ వరకే కిరండూల్‌ రైళ్లు

Jul 15 2025 6:11 AM | Updated on Jul 15 2025 6:11 AM

కోరాపుట్‌ వరకే కిరండూల్‌ రైళ్లు

కోరాపుట్‌ వరకే కిరండూల్‌ రైళ్లు

తాటిచెట్లపాలెం : కేకే లైన్‌లో జరుగుతున్న పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే కిరండూల్‌ రైళ్లు ఆయా తేదీల్లో కోరాపుట్‌ వరకే నడుస్తాయని వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం సందీప్‌ తెలిపారు. ఈ నెల 15వ తేదీన విశాఖపట్నం–కిరండూల్‌ (18515) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ కోరాపుట్‌ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 15, 16వ తేదీల్లో కిరండూల్‌– విశాఖపట్నం(18516)నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ కిరండూల్‌ నుంచి కాకుండా కోరాపుట్‌ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే ఈ నెల 15, 16వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్‌ (58501) పాసింజర్‌ కోరాపుట్‌ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 15, 16వ తేదీల్లో కిరండూల్‌– విశాఖపట్నం (58502) పాసింజర్‌ కిరండూల్‌ నుంచి కాకుండా కోరాపుట్‌ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement