
అదెరన్
సముద్ర వాణిజ్యానికి చిరునామా బంగాళాఖాతం
కూటమి అరాచక పాలనపై
పోరాడుదాం
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
8లో
వైజాగ్ నేవీ మారథాన్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివారం మొదటి కౌంట్‌డౌన్ పరుగును విశాఖ సాగరతీరంలో నిర్వహించారు. మారథాన్‌లో పాల్గొనేవారిని ప్రోత్సహించడం, మానసికంగా, శారీరకంగా బలోపేతం చేయడం కోసం నిర్వహించిన ఈ పరుగులో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్‌లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా రన్నర్లు వస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 14న జరగనున్న మారథాన్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం మారథాన్‌కు ‘రెడ్యూస్, రీయూజ్, రిసైకిల్’ నినాదం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్లాస్టిక్ రహిత మారథాన్‌ను నిర్వహించడమే దీని ముఖ్య లక్ష్యం. ఈ కౌంట్‌డౌన్ పరుగుతో ప్రధాన మారథాన్‌కు అన్ని ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
– విశాఖ స్పోర్ట్స్
మారథాన్‌లో పాల్గొన్న నేవీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు