
గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్‌పై ఏయూ అతిథి అధ్యాపకుల ఆగ
మద్దిలపాలెం: ఆంధ్ర యూనివర్సిటీలో కూటమి ప్రభుత్వం సిక్స్‌మెన్ కమిటీ ద్వారా సెలెక్టయి, పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కాదని, నోటిఫికేషన్ జారీ చేసి, కొత్తగా దరఖాస్తులు కోరడం అన్యాయమని అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్‌మీనన్ ఆక్షేపించారు. ఏయూలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏటా రివ్యూ జరగటం సర్వసాధారణమని, కానీ కూటమి ప్రభుత్వంలోనే సెలక్టయి, ఆరు మాసాలు కాకుండానే మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు చేసినట్టే తమకూ రివ్యూ నిర్వహించి, మిగిలిన ఖాళీలకు కొత్త వారిని ఇంటర్వ్యూ చేయాలని కోరారు. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్జెస్ట్‌మెంట్ ప్రొఫెసర్, చైల్డ్ ప్రొపెషనర్లకు నెలకు రూ.80 వేలు చొప్పున జీతం చెల్లిస్తున్నా, వారికి రివ్యూ గానీ, ఇంటర్వ్యూలు గానీ లేవని, తమకు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించడం, ముమ్మాటికీ అణచివేతలో భాగమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ను సోమవారం కలిసి, తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో అతిథి అధ్యాపకులు ప్రసాద్, విక్రమ్, దాస్, గిరీష్ దేవా, రాయ్, వెంకట్, ఫణి అంబేడ్కర్, ద్రాక్షాయణి, భాను, మృత్యుంజయ, సురేంద్ర, వెంకటరమణ, రవి, ఇంజనీరింగ్ అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు.