
ఆకట్టుకున్న టామీ టామీ వీధి నాటిక
సీతంపేట: సుదర్శన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయం ఎదుట ఆరుబయట ‘టామీ టామీ టామీ’వీధి నాటిక ప్రదర్శించారు. ఉన్నత వర్గానికి, సామాన్య వర్గానికి న్యాయం ఎలా జరుగుతుందో తెలియజేసే ఇతివృత్తంతో కళాకారులు ప్రదర్శించిన ఈ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కుక్కకు ఉన్న విలువ మనిషి లేదని తెలిపేలా కళాకారులు నాటిక ప్రదర్శించి రక్తి కట్టించారు. ఈ నాటికలో చలసాని కృష్ణ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్‌గా, జి.కన్నబాబు కానిస్టేబుల్‌గా, కె.శేషగిరిరావు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా, పి.మురళీధర్ ఖాళీ కుర్రాడిగా, బి.అప్పన్నకుమార్ యువకుడిగా, వర్రె నాంచారయ్య బూతద్దాల ముసలోడిగా, ఎన్.గౌరీశ్వరరావు కోర్టు గుమాస్తాగా, చంద్రాన దుర్గాప్రసాద్, బొబ్బా ధవళేశ్వరరావు డీఎస్పీ ఆర్డర్లీగా నటించి మెప్పించారు.