
ముంచెత్తిన వర్షం
మహారాణిపేట: జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఈ భారీ వర్షం జనజీవనానికి అంతరాయం కలిగించింది. ఈదురుగాలులకు పందిమెట్ట, బుల్లయ్య కాలేజీ వద్ద చెట్లు నేలకొరిగాయి. ఆశీలమెట్ట వద్ద హోర్డింగులు కూలిపోయాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, కంచరపాలెం సహా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా భీమిలిలో 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పద్మనాభంలో 10.8 మిల్లీమీటర్లుగా నమోదైంది.

ముంచెత్తిన వర్షం

ముంచెత్తిన వర్షం