కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి బ్లాస్ట్‌ఫర్నేస్‌ సందర్శన | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి బ్లాస్ట్‌ఫర్నేస్‌ సందర్శన

Apr 15 2025 1:21 AM | Updated on Apr 15 2025 1:21 AM

కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి బ్లాస్ట్‌ఫర్నేస్‌ సందర్

కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి బ్లాస్ట్‌ఫర్నేస్‌ సందర్

ఉక్కునగరం : కేంద్ర ఉక్కు సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ సోమవారం బ్లాస్ట్‌ఫర్నేస్‌–1ను సందర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ పర్యటనలో భాగంగా వచ్చిన ఆయనకు విభాగం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బీఎఫ్‌–1లో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. విభాగంలో సాధిస్తున్న విజయాలను అధికారులు, విభాగం కార్మికులు ఆయనకు వివరించారు. కార్మిక నాయకులు బాబా (ఏఐటీయూసీ), పోలీసు నాయుడు (ఐఎన్‌టీయూసీ), కోటేశ్వరరావు, అలమండ శ్రీనివాసరావులు కార్మికుల సమస్యలను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, తద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. పర్యటనలో ఆయనతో పాటు డైరెక్టర్లు సలీం వి పురుషోత్తమన్‌, గణేష్‌, జి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement