తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో తాళ్లవలస తిరుమల విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ నుంచి ఎం.విద్యాచరణ్, ఆర్.హేమచరణ్, ఎ.ఆర్.ప్రజ్వలిత, కె.లలిత్ ఆదిత్య, బి.సిద్ధార్థ్, ఎం.భగవతి, జె.శ్రీలక్ష్మి, వై.తనుశ్రీ, కె.దీపిక, కె.స్పందన 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకు గాను సీహెచ్ మేఘన 436 మార్కులు సాధించింది. ఫైనల్ ఇయర్ ఎంపీసీలో వై.స్నేహిత, కె.శృతిలయ, కె.తులసి 990 మార్కులు సాధించారు. బైపీసీలో వై.అశ్వినిశ్రీ 989 అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.ఎన్.వి.వి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, జి.సతీష్‌బాబు అభినందించారు.