స్ట్రాంగ్‌ రూమ్‌ల తనిఖీ | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌ల తనిఖీ

Published Sun, May 26 2024 4:40 AM

స్ట్రాంగ్‌ రూమ్‌ల తనిఖీ

మహారాణిపేట: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం తనిఖీ చేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా పోలీసు జాయింట్‌ కమిషనర్‌ ఫకీరప్ప, ఏడీసీ కె.ఎస్‌. విశ్వనాథన్‌లతో కలిసి పార్లమెంట్‌, అసెంబ్లీ స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ తనిఖీ చేసి.. అక్కడ పరిస్థితులను గమనించారు. భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, మానిటరింగ్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షణ గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, అధికారులు వారి వెంట ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement