సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు | Sakshi
Sakshi News home page

సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు

Published Sun, May 26 2024 4:40 AM

సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు

చ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు నంబర్‌ వన్‌ పోర్టుగా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ అడుగులు వేస్తోంది. సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీలు, కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు చానళ్లు, బెర్తులను మరింత లోతుగా విస్తరించడం ద్వారా అంతర్గత వనరుల నుంచి ఆదాయం ఆర్జించేలా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్‌, బొగ్గు, జిప్సం, బాకై ్సట్‌ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తులు రవాణా జరుగుతుంటుంది. భవిష్యత్‌లో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీ సామర్థ్యాన్ని కూడా పెంచేలా పోర్టు పనులు ప్రారంభించింది. రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలకు వీపీఏ ఉపక్రమించింది. పోర్టులోని ఆర్‌అండ్‌డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్‌ల నిర్మాణం, ప్యానెల్‌ ఇంటర్‌లాకింగ్‌ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ఈక్యూ–6 అభివృద్ధికి శ్రీకారం

పోర్టు ఇన్నర్‌ హార్బర్‌లోని ఈక్యూ–6 బెర్త్‌ అభివృద్ధి, యాంత్రీకరణ పనులను మెస్సర్స్‌ ఎవర్‌ సన్‌ మైరెన్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. పీపీపీ విధానంలో ఈ పనులను ఆ సంస్థ త్వరలో చేపట్టనుంది. ప్రస్తుతం ఈ క్యూ–6 బెర్త్‌ పాక్షిక యాంత్రీకరణతో ఉంది. దీని పొడవు 255 మీటర్లు. యాంత్రీకరణలో భాగంగా క్రేన్‌లు, లోడర్స్‌, ట్రక్స్‌, పోర్క్‌ లిఫ్ట్స్‌ వంటి పరికరాలు అందుబాటులోకి వస్తాయి. రూ.66.12 కోట్ల విలువైన ఈ ఆధునికీకరణ పనులు పూర్తయితే.. ఏడాదికి 2.62 మిలియన్‌ మెట్రిక్‌ సరకును రవాణా చేసే సామర్థ్యానికి పోర్టు చేరుకోనుంది. బెర్త్‌ను ఆధునికీకరించడం ద్వారా 50,000 డీడబ్ల్యూటీ సామర్థ్యం, 200 మీటర్ల పొడవు 32 మీటర్ల బీమ్‌, 11.50 మీటర్ల డ్రాఫ్ట్‌ కలిగిన నౌకలను కూడా హ్యాండిల్‌ చేసే అవకాశం కలుగుతుంది. 15 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ బెర్త్‌ను అభివృద్ధి చేయడం ద్వారా 100 మందికి నేరుగా, మరికొంత మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

మోడ్రన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

మరోవైపు సరకు హ్యాండ్లింగ్‌ చురుగ్గా నిర్వహించేందుకు అత్యాధునిక పద్ధతులను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సాంకేతిక కేంద్రం(ఎన్‌టీసీపీడబ్ల్యూసీ) వెసెల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంతో రూ.14.03 కోట్లతో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సరకు రవాణాలో వెసెల్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అనేది అత్యంత కీలకమైన అంశం. పోర్టుల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమైనది. కార్గోని వీలైనంత త్వరగా ఎగుమతి దిగుమతులు చేసేందుకు ఈ మోడ్రన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఉపయుక్తంగా నిలుస్తుంది.

ఈస్ట్‌కోస్ట్‌ గేట్‌ వే ఆఫ్‌ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖ పట్నం పోర్టు అథారిటీ గేరు మార్చింది. సరకు రవాణాలో ఏటికేడూ వృద్ధి నమోదు చేసుకుంటున్న పోర్టు.. దేశంలోని మేజర్‌ పోర్టులతో పోటీ పడుతోంది. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇందులో భాగంగానే హ్యాండ్లింగ్‌ కోసం మోడ్రన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. మరోవైపు భారీ నౌకలను సైతం సులువుగా బెర్తింగ్‌ చేసేలా బెర్తులను ఆధునికీకరిస్తోంది. – సాక్షి, విశాఖపట్నం

విశాఖ పోర్టు అథారిటీ వినూత్న ప్రణాళికలు

సరకు రవాణాలో ఆధునిక సాంకేతికత

రూ.14.03 కోట్లతో మోడ్రన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌

రూ.66.12 కోట్లతో ఈక్యూ–6 బెర్త్‌ అత్యాధునిక యాంత్రీకరణ

భారీ నౌకలను సైతం సులువుగా హ్యాండ్లింగ్‌ చేసేలా నిర్మాణం

100 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు

Advertisement
 
Advertisement
 
Advertisement