బాలికపై కేజీహెచ్‌ ఉద్యోగి లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

బాలికపై కేజీహెచ్‌ ఉద్యోగి లైంగిక వేధింపులు

Published Sun, May 26 2024 4:40 AM

-

డాబాగార్డెన్స్‌: దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేజీహెచ్‌ ఉద్యోగి దిలీప్‌పై వన్‌టౌన్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పోక్సో కేసు విషయమై వైద్య పరీక్షల కోసం ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ నుంచి కేజీహెచ్‌ గైనిక్‌ వార్డుకు వచ్చిన బాలిక పట్ల అక్కడ పనిచేస్తున్న దిలీప్‌ అనుచితంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. ఈ విషయమై ఆ బాలిక తన తల్లిదండ్రుల వద్ద మొర పెట్టుకుంది. వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆరిలోవ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదు అవ్వడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసి.. వన్‌టౌన్‌ పోలీసులకు బదిలీ చేశారు. వన్‌టౌన్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దిలీప్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement