రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం | Sakshi
Sakshi News home page

రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం

Published Sun, May 19 2024 6:20 AM

-

డాబాగార్డెన్స్‌ : జీవీఎంసీ జోన్‌–2 పరిధి పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా చేసే విషయమై బోని గ్రామం వద్ద ఉన్న గోస్తనీ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 ఎంఎం మందం గల పైపులైన్‌ వేస్తున్నందున ఆ రోజు జోన్‌–2 పరిధి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. బోయపాలెం హౌసింగ్‌ కాలనీ, పరదేశిపాలెం, ఈడబ్ల్యూఎస్‌ కాలనీ, పరదేశిపాలెం విలేజ్‌, బోరవానిపాలెం విలేజ్‌, మారికవలస విలేజ్‌, పీపీ–2 హౌసింగ్‌ కాలనీ, సాయిరాం కాలనీ ఫేస్‌ 2 అండ్‌ 3, జీసీసీ లే అవుట్‌, భగవాన్‌దాస్‌ కాలనీ, రేవళ్లపాలెం, ఎంఎస్‌ఆర్‌ లే అవుట్‌, సంపత్‌నగర్‌, సాయిప్రియ లే అవుట్‌, గాయత్రీనగర్‌ హౌసింగ్‌ కాలనీ, పీఎం పాలెం మొదటి బస్టాప్‌ ఏరియా, స్టేడియం వెనుక ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుందని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement