No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Apr 20 2024 1:15 AM

- - Sakshi

పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పెందుర్తి రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి పి.శేషశైలజకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ముందుగా ఇంటి వద్ద తల్లిదండ్రులు సత్యనారాయణ, రామలక్ష్మి ఆశీర్వచనం తీసుకున్న అదీప్‌రాజ్‌ రాంపురం నుంచి కార్యకర్తలు, నాయకులు కార్ల ర్యాలీ నడుమ పెందుర్తి చేరుకున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. రాంపురం నుంచి పెందుర్తి రైల్వే ఓవర్‌ వంతెన నుంచి వెలంపేట, పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి, పెందుర్తి పాత ప్రభుత్వ ఆస్పత్రి కూడలి మీదుగా జూనియర్‌ కళాశాల వరకు బీఆర్‌టీఎస్‌ రహదారిపై కార్లుతో ర్యాలీ వెల్లువలా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బయిలపూడి భగవాన్‌ జయరామ్‌, సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌లు ముమ్మన దేముడు, బట్టు సూర్యకుమారి, ఎంపీపీ మధుపాడ నాగమణి, జెడ్పీటీసీ సభ్యులు ఉప్పిలి దేవి, రాజు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోడిగుడ్ల దేవిసాంబ, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ నేతలు గండి రవికుమార్‌, చుక్కా రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన పేరిట రూ.2 కోట్ల వరకు స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా పెందుర్తి రైల్వేస్టేషన్‌ వద్ద రైల్‌రోకో నిరసనపై అదీప్‌రాజ్‌పై కేసు నమోదైంది. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం 2015లో చేపట్టిన నిరాహార దీక్షపై మరో కేసు అదీప్‌రాజ్‌పై నమోదు కాగా.. అవి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement