ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు

Published Sat, Apr 20 2024 1:15 AM

-

తాటిచెట్లపాలెం : ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం – బెంగళూరు – విశాఖపట్నం మధ్య సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – ఎస్‌ఎంవీ బెంగళూరు (08549) సమ్మర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ శనివారం విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 29 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీ బెంగళూరు – విశాఖపట్నం (08550) సమ్మర్‌ స్పెషల్‌ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 30 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడ్‌, జోలర్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి.

Advertisement
 
Advertisement