జోన్‌–5 కమిషనర్‌పై విచారణ! | Sakshi
Sakshi News home page

జోన్‌–5 కమిషనర్‌పై విచారణ!

Published Fri, Apr 19 2024 1:05 AM

- - Sakshi

గోపాలపట్నం: జోన్‌–5 కమిషనర్‌ ఆర్‌.జి.వి.కృష్ణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘జోన్‌–5 జెడ్సీ అధికార దుర్వినియోగం’అనే కథనానికి అధికారులు స్పందించారు. ముందుగా ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. అధికార దుర్వినియోగానికి సంబంధించి కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, అడిషనల్‌ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ ఆయన్ని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఎన్నికల్లో పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కలెక్టర్‌ మల్లికార్జున జెడ్సీని వివరణ కోరినట్లు తెలిసింది. కాగా.. జోన్‌–5 కమిషనర్‌ కృష్ణ అధికార దుర్వినియోగానికి సంబంధించి మరిన్ని విష యాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం ఆయన ఇంటి వద్ద 10 మంది వరకు జీవీఎంసీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది.జీవీఎంసీ 51వ వార్డు సూపర్‌వైజర్‌ గణేష్‌ జెడ్సీ పిల్లలకు సేవకుడిగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్‌ జి.గోపి జెడ్సీ ఇంట్లో పని చేస్తున్నట్లు తెలిసింది. డ్రైవర్లు కె. కోటి, ఫణికుమార్‌లు జెడ్సీ వేధింపులు భరించలేక ఉద్యోగాల మానేశారని సహచరులు చెబుతున్నారు. జెడ్సీ జీవీఎంసీ సిబ్బందిని ఇక్కడి నుంచి పలాస తీసుకెళ్లి పనులు చేయిస్తున్నారని వారు వెల్లడించారు.

Advertisement
 
Advertisement