చంద్రబాబుకు ఓటమి భయం

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఓటమి భయంతో మతిభ్రమించి పేద ప్రజలపై, అవ్వా తాతలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, శాసనమండలి విప్‌ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంగళవారం సిరిపురంలో గల ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూసే పండుటాకుల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారన్నారు.

ఎన్నికల కోడ్‌ మూడు నెలల పాటు అవ్వాతాతలకు ఫించను అందకుండా అడ్డుకొని రాక్షస ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేద ప్రజల కోసం ఏరోజైనా ఆలోచన చేశారా..?అని విమర్శించారు. పేదవాళ్లు అంటే మొదటి నుంచి చంద్రబాబుకు చులకన భావమని, వాళ్లను తక్కువ చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూశామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమం, అభివృద్ధే 2024 లో మరో మారు విజయాన్ని అందిస్తోందని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటివరకు రూ.2.7 లక్ష కోట్లు డీబీటీ పద్ధతిలో నేరుగా పేదల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసి ఆర్థికంగా బలోపేతం చేశారని కొనియాడారు.

ఈ పాలన చూసే చంద్రబాబు పేదలకు సంక్షేమం అందకుండా కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజల మనస్సులో సీఎం జగనన్నపై ఉన్న ప్రేమ, ఆప్యాయతను చెరపలేరని, ఆయన అందించిన గొప్ప పరిపాలనే మరో మారు సీఎంగా గెలిపించనుందన్నారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ వలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తారని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. వలంటీర్లలో 76 శాతం మహిళలే ఉన్నారు. మహిళలే ఇలాంటి పనులు చేస్తారా, అలాగే వలంటీర్లలో 60 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, లంచాలు లేకుండా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ అని కొనియాడారు.

Election 2024

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top