సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం

Published Thu, Feb 22 2024 12:48 AM

- - Sakshi

గోపాలపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉదయం 11.48 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని, ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి విశాఖ వచ్చారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన విశాఖ శ్రీ శారదా పీఠానికి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపిల్లి సుభద్ర, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, ఎస్‌.రవిపటాన్‌ శెట్టి, నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఫకీరప్ప, జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, అడిషనల్‌ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ స్వాగతం పలికా రు. మధ్యాహ్నం 3.27 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు. ఆయనకు మంత్రులు, పార్టీ నేతలు, అధికారులు వీడ్కోలు పలికారు.

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement