తాళం వేసిన ఇళ్లే అతని టార్గెట్‌

మధురానగర్‌లో చోరీకి గురైన ఇంటినిపరిశీలిస్తున్న క్రైం డీసీపీ రత్నం   - Sakshi

 సతమ్మధార: గాజువాక, సీతంపేట, మధురానగర్‌, పీఎంపాలెం తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది మోహన్‌కృష్ణగా పోలీసులు గుర్తించారు. అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాడు. పోలీసులకు సవాల్‌ విసిరి దొంగతనాలు చేస్తున్న కర్నాటకకు చెందిన మోహన్‌ కృష్ణపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి.

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ.. ఇంటికి తాళం వేసి ఉంటే వెంటనే చోరీ చేయడంలో అతను సిద్ధహస్తుడు. సీతంపేట దుర్గాగణపతి ఆలయం వెనుక నలుగురు యువకులు అద్దెకు ఉంటున్న గదిలో, మధురానగర్‌లోని ఓగ్రూప్‌ హౌస్‌లో శనివారం చోరీలు జరగ్గా.. మోహన్‌కృష్ణే నిందితుడని పోలీసులు గుర్తించారు. దీంతో మూడు బృందాలుగా ఏర్పడి కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నగరంలో దొంగతనాలు జరిగిన ఇళ్లతోపాటు ఇతర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాత నేరస్తులను విచారిస్తున్నారు.

whatsapp channel

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top