దుర్గమ్మకు బంగారపు వస్తువుల విరాళం

బచ్చు మాధవీకృష్ణ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో రామారావు  - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విశాఖకు చెందిన సత్యనారాయణరెడ్డి, విజయ దంపతులు 47 గ్రాముల బంగారంతో బొట్టు, నత్తు, బులాకీలను సమర్పించారు. సత్యనారాయణరెడ్డి, విజయ దంపతులకు స్నేహితురాలైన దేవస్థాన పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవీకృష్ణ దంపతుల చేతుల మీదుగా ఆలయ ఈవో కేఎస్‌ రామారావుకు మంగళవారం బంగారపు ఆభరణాలను అందజేశారు. సుమారు 20.8 గ్రాముల బంగారు రాళ్లబొట్టు, 15.8 గ్రాముల బంగారంతో నత్తు, 10.7 గ్రాముల బంగారంతో బులాకీలను తయారు చేయించి దేవస్థానానికి అందించారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top