బడుగుల ఆశాజ్యోతి పూలే

- - Sakshi

డాబాగార్డెన్స్‌: బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గ్రీన్‌పార్క్‌ హోటల్‌ కూడలిలోని పూలే విగ్రహానికి మంగళవారం కలెక్టర్‌ మల్లికార్జున, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులుతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలహీన వర్గాలు, బహుజనుల శ్రేయస్సు కోసం పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. కోలా గురువులు మాట్లాడుతూ పూలే చేసిన కృషి ఫలితంగా నేడు బడుగు వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోగలిగారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మన్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శిష్టకరణాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ అనూష పట్నాయక్‌, పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, పేడాడ రమణికుమారి, తుళ్లి చంద్రశేఖర్‌, లాడే కిశోర్‌, ఎస్సీ సెల్‌ నాయకుడు బోని శివరామకృష్ణ, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు యువశ్రీ, రీసు అనురాధ, నాయకులు గొలగాని రాము తదితరులు పాల్గొన్నారు.

పూలే సేవలు చిరస్మరణీయం

కొమ్మాది: సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు అన్నారు. ఎండాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కోలా గురువులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనం, మహిళా విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పిల్లా సుజాత సత్యనారాయణ, పేర్ల విజయచంద్ర, అప్పలకొండ, జోన్‌ ఇన్‌చార్జిలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top