మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహావిష్కరణ | Sakshi
Sakshi News home page

మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహావిష్కరణ

Published Wed, Nov 22 2023 12:54 AM

విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యుటీ సీఎం రాజన్నదొర - Sakshi

ఎంవీపీ కాలనీ: స్థానిక ఉషోదయ కూడలిలోని పర్యవేక్షణ ఇంజినీరింగ్‌(గిరిజన సంక్షేమ శాఖ) కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని మంగళవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అద్భుతమైన ఇంజినీర్‌గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన ఖ్యాతి వెలకట్టలేనిదన్నారు. బ్రిటీష్‌ పాలకులు సైతం ఆయన ప్రతిభను కొనియాడారంటే అర్థం చేసుకోవచ్చన్నారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో యువత ఇంజినీరింగ్‌ రంగంలో అద్భుతాలు సృష్టించాలన్నారు. యువ ఇంజినీర్లు దేశానికి, సమాజానికి విలువైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.శ్రీనివాస్‌, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు పీపీడీ పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement