త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి | Sakshi
Sakshi News home page

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి

Published Wed, Nov 22 2023 12:54 AM

- - Sakshi

దొండపర్తి: జిల్లాలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో హౌసింగ్‌, సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి జిల్లాలోని జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై వెబెక్స్‌ ద్వారా జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, హౌసింగ్‌ డీఈలు, ఏఈలు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పని ప్రారంభించిన ప్రతి ఇంటికి బ్యాంక్‌ ఖాతా తెరిచి ఆన్‌లైన్‌లో అప్డేట్‌ చేయాలని సూచించారు. పూర్తయిన ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసి, ఆ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈకు సూచించారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు కాలనీల్లో మంచినీటి కుళాయిల సౌకర్యం కల్పించాలన్నారు. కాలనీ ముఖ ద్వారా ఆర్చ్‌ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలకు సూచించారు. పనుల పూర్తికి అధికారులు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యటించాలన్నారు.

Advertisement
Advertisement