విశాఖ చేరిన గురునాథ్‌ పాదయాత్ర | Sakshi
Sakshi News home page

విశాఖ చేరిన గురునాథ్‌ పాదయాత్ర

Published Tue, Nov 14 2023 12:42 AM

- - Sakshi

కొమ్మాది: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గురునాథ్‌ యాదవ్‌ చేపట్టిన పాదయాత్ర సోమవారం విశాఖపట్నం చేరుకుంది. శ్రీకాకుళం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఇందులో భాగంగా సోమవారం గురునాథ్‌ ఎండాడలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఘనంగా సత్కరించారు. అనంతరం గురునాథ్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ముందుగు సాగుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుతం జగనన్న సుపరిపాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలని, అందుకు శ్రీవేంకటేశ్వరస్వామి దీవెనలు ఉండాలని వేడుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు అక్కరమాని వెంకటరావు, రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ మళ్లీ సీఎం కావాలంటూ తిరుపతికి కాలినడకన

జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో

ఘన సత్కారం

 
Advertisement
 
Advertisement