అలలకు విద్యార్థి బలి | Sakshi
Sakshi News home page

అలలకు విద్యార్థి బలి

Published Tue, Nov 14 2023 12:42 AM

లోకేష్‌ (ఫైల్‌)  - Sakshi

పరవాడ: దీపావళి నాడు స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన అచ్యుతాపురం మండలం తంతడి తీరంలో ఆదివారం చోటుచేసుకొంది. మండలంలోని అప్పన్నపాలేనికి చెందిన రెడ్డి లోకేష్‌ (19) మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి ఆదివారం తంతడి బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నేహితులంతా సరదాగా గడిపి సాయంత్రం 4.30 గంటల సమయంలో సముద్రంలో స్నానానికి దిగారు. ఆ సమయంలో ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలకు లోకేష్‌ లోపలికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ప్రమాదాన్ని గమనించి లోకేష్‌ను రక్షించారు. అప్పటికే నీటిలో మునిగిపోవడం వల్ల నీరు తాగేయడంతో స్పృహ కోల్పోయాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. లోకేష్‌ అచ్యుతాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చేతికి అందొచ్చిన కుమారుడిని సముద్రపు అలలు మింగేయడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న తండ్రి నూకరాజు దంపతులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పీఎం అనంతరం మృతదేహన్ని బంధువులకు అప్పగించామని సీఐ ఈశ్వరరావు చెప్పారు.

Advertisement
 
Advertisement