ఘనంగా నరకాసుర వధ | Sakshi
Sakshi News home page

ఘనంగా నరకాసుర వధ

Published Tue, Nov 14 2023 12:42 AM

నరకాసురుడి వధ ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకుడు  - Sakshi

సింహాచలం: నరకచతుర్దశి, దీపావళి సందర్భంగా సింహగిరిపై ఆదివారం రాత్రి నరకాసుర వధ ఉత్సవం ఘనంగా జరిగింది. రాత్రి ఆరాధన అనంతరం ఆలయ వైదికులు.. సింహాద్రి అప్పన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఒక పల్లకిలో, నరకాసురుడి విగ్రహాన్ని మరో పల్లకిలో మాడ వీధుల్లోకి తిరువీధిగా తీసుకొచ్చారు. నరకాసురుడు, స్వామి ఉత్సవమూర్తుల పల్లకీలను ఎదురుఎదురుగా ఉంచి యుద్ధ సన్నివేశాలు నిర్వహించారు. తరువాత నరకాసుర వధ జరిపారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

నరకాసురుడిని, అప్పన్న ఉత్సవమూర్తులను ఉంచి యద్ధసన్నివేశం నిర్వహిస్తున్న దృశ్యం
1/1

నరకాసురుడిని, అప్పన్న ఉత్సవమూర్తులను ఉంచి యద్ధసన్నివేశం నిర్వహిస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement