అన్వేషి.. ఓ ఫీల్‌ గుడ్‌ మూవీ | Sakshi
Sakshi News home page

అన్వేషి.. ఓ ఫీల్‌ గుడ్‌ మూవీ

Published Sat, Nov 11 2023 12:48 AM

మాట్లాడుతున్న చిత్ర హీరో విజయ్‌  - Sakshi

బీచ్‌రోడ్డు: మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ ‘అన్వేషి’ అని ఆ చిత్ర హీరో విజయ్‌ ధరణ్‌ అన్నారు. చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. కొత్త నటులతో భారీ బడ్జెట్‌తో నిర్మాత గణపతి రెడ్డి ఈ చిత్రం నిర్మించారన్నారు. సినిమా డైరెక్టర్‌ వి.జె.ఖన్నా మాట్లాడుతూ అన్వేషి సినిమాను ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఊహించని ట్విస్టులు ఉంటాయన్నారు. మారేడుమిల్లి అడవుల్లో 47 రోజుల పాటు చిత్రీకరణ జరిపామన్నారు. హీరోయిన్‌ సిమ్రాన్‌ గుప్తా మాట్లాడుతూ అన్వేషి విభిన్నమైన సినిమా అన్నారు. కార్యక్రమంలో హాస్యనటుడు నాగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement