2100 మంది రోగుల గుర్తింపు | Sakshi
Sakshi News home page

2100 మంది రోగుల గుర్తింపు

Published Tue, Nov 7 2023 12:48 AM

-

సీతంపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన కంటి వెలుగు శిబిరాలలో సుమారు 1,600 క్యాటరాక్ట్‌ కేసులు, 500 ఇతర రిఫరల్‌ కేసులు గుర్తించినట్టు ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.విశ్వామిత్ర తెలిపారు. వీరందరికి సత్వర వైద్యం అందేలా ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌, ప్రత్యేక అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక విభాగంలో రోగులను తనిఖీ చేసి ఆపరేషన్‌కు అవసరమైన వారిని ప్రత్యేక బ్లాక్‌ వైద్యం అందజేస్తామన్నారు. కళ్లద్దాలు అవసరమైనవారికి ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.

Advertisement
 
Advertisement