ఇబ్రహీంపట్నంలో శాఖాహార ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నంలో శాఖాహార ర్యాలీ

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

ఇబ్రహీంపట్నంలో శాఖాహార ర్యాలీ

ఇబ్రహీంపట్నం: బ్రహ్మర్షి పత్రీజీ దివ్య మార్గనిర్దేశంలో శుక్రవారం ఇబ్రహీంపట్నంలో శాఖాహార ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. మాంస భక్షణ–మహా పాపకర్మ.. కోడి, మేక, చేప మన ఆహారం కోసం కాదు.. మాంసం అంటే హింస, హింస అంటే పాపం.. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.. ధ్యానం సర్వరోగ నివారిణి అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక బృందావన్‌ కాలనీలో శ్రీ జయ హనుమాన్‌ పిరమిడ్‌ కేంద్రాన్ని సీనియర్‌ ధ్యాన మాస్టర్స్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ధ్యానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో మాస్టర్స్‌ లక్ష్మి, స్వాగత్‌, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌, అమృత్‌, శ్రీలత, సులోచన, విజయలక్ష్మి, అఖండ ధ్యాని జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement