రేపు నవోదయ మోడల్ టెస్ట్
తాండూరు టౌన్: తాండూరు పట్టణంలో ఆదివారం శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నవోదయ మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ, నిర్వాహకులు కృష్ణయ్య శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న నవోదయ పరీక్ష రాయబోతున్న విద్యార్థుల్లో భయాందోళనను పోగొట్టేందుకు ఈ ముందస్తు మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో టెస్ట్ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు శనివారం రాత్రి 8 గంటల లోగా భాష్యం కళాశాలలో పేర్లు నమోదు చేసుకుని హాల్ టికెట్లు పొందాలన్నారు. ఇతర వివరాల కోసం సెల్ నంబర్ 91603 80805లో సంప్రదించాలన్నారు.
ప్రభుత్వ తీరును
ఎండగట్టండి
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట: ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని లింగన్‌పల్లి తదితర గ్రామాల్లో సర్పంచ్ అభ్యుర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా మళ్లీ ప్రజలకు వద్దకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
పరిగి: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పరిగి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జడ్చర్లలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పరిగి పట్టణంలోని గ్లోబల్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి ఆష్నా సాదియాబేగం, మూడో తరగతి విద్యార్థులు ఆఫ్మిన్‌రహామత్, జునైరా షేక్ ప్రథమ స్థానంలో నిలిచారు. శుక్రవారం విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
విశ్రాంత ఉద్యోగులసంఘం జిల్లా కమిటీ ఎన్నిక
అనంతగిరి: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేస్తామని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సత్యసాయి జ్ఞాన కేంద్రం ఆవరణలో సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాణిక్‌ప్రభు, జనరల్ సెక్రటరీగా జీవన్‌కుమార్, ఆర్థిక కార్యదర్శిగా అంబదాస్, అసోసియేటెడ్ ప్రెసిండెంట్‌గా చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా వెంకటసింగ్, మనోహర్‌రావు, విఠల్, కార్యదర్శులుగా యాదగిరి, రాము, సంయుక్త కార్యదర్శులుగా విఠోబా, మధుకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జనార్దన్, అంజిలయ్య, ప్రచార కార్యదర్శిగా బందెప్పగౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నరసింహరెడ్డిను ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా గోపాల్‌రెడ్డి, బసవేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు నవోదయ మోడల్ టెస్ట్
రేపు నవోదయ మోడల్ టెస్ట్


