జీపీల అభివృద్ధికి సహకారం
తాండూరు: ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్‌లు పల్లెలను ప్రగతి పథంలో నడిపించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికై న 25 మంది సర్పంచ్‌లను, వార్డు సభ్యులను సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు లాంటివని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. పంచాయతీల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. 30 ఏళ్ల పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఒకేసారి 25 జీపీలు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వారు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంగా ప్రజలకు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, ఏకగ్రీవ సర్పంచ్‌లు రాజ్‌కుమార్, పటేల్ విజయ్‌కుమార్, పురుషోత్తంరెడ్డి, వెంకట్‌రెడ్డి, అనసూయ, పెద్దేముల్ మండలానికి చెందిన గౌరమ్మ, మంగమ్మ, పద్మమ్మ, విజయ్, బషీరాబాద్ మండలానికి చెందిన అనిత, నవనీత,అనితబాయి, భీమప్ప, పున్నిబాయి, యాలాల మండలానికి చెందిన నరేష్, మల్లేశం, లాలప్ప, పల్లె స్వప్న, గుర్రాల నాగమణి, నేనావత్ శాంతి బాయి, రామవత్ కిషన్, కమలబాయి, సంగెం సుధాలక్ష్మి, అంగోత్ మోహన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


