పోరాటంతోనే హక్కుల సాధన
పరిగి: మెదక్ పట్టణంలో ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కోరారు. శుక్రవారం పట్టణంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతు లో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వీటిపై ఐక్యంగా పోరాటం చేయాల ని పిలుపునిచ్చారు. అప్పుడే న్యాయం జరుగుతుందని తెలిపారు.
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా..
కొడంగల్ రూరల్: మెదక్ పట్టణంలో ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కో శాధికారి బుస్స చంద్రయ్య కోరారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీ లేని పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు,అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, జీపీ,మున్సిపల్ వర్కర్లు, హమాలీ, మిషన్ భగీరథ, హాస్టల్ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజు పవర్, యాసిన్, మహబూబ్, అంజి, ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు.


