జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధిస్తారని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జినుగుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తమ్‌చందు నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలోని 24 గ్రామాలను ఏకగ్రీవం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో కూడా అన్ని సర్పంచ్ స్థానాలను ప్రజలు గెలిపించుకుంటారని తెలిపారు. జినుగుర్తి గ్రామంలో రఘు కిషోర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్‌రెడ్డి శ్యామప్ప, అజ్మాత్, అసీం అలీ, మాణిక్యం, యశ్వంత్, రాజు, భాస్కర్, గడ్డమీది నాగమ్మ, కృష్ణారెడ్డి, కిష్టప్ప, సురేష్‌గౌడ్, మొగులప్ప, దేవిజ నాయక్, వెంకట్, భద్రుజాదవ్ తదితరులు పాల్గొన్నారు.


