ఎన్నికల ప్రక్రియలో సమస్యలకు తావివ్వొద్దు
అదనపు కలెక్టర్ సుధీర్
దోమ: స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష అన్నారు. శుక్రవారం మండలంలోని బొంపల్లి గ్రామంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎక్కడ కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఓటింగ్ వరకు జాగ్రత్తగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


