కరన్‌కోట్ ఉప సర్పంచ్‌గా తుపాకుల బసప్ప
తాండూరు రూరల్: మేజర్ గ్రామపంచాయతీ కరన్‌కోట్ ఉప సర్పంచ్‌గా తుపాకుల బసప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి విజయ్‌భాస్కర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. గ్రామంలో సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యులను యునానిమస్‌గా ఎన్నికయ్యారు. వీరిలో పదో వార్డుకు చెందిన బసప్ప పేరును మూడో వార్డు సభ్యుడు కోస్గి మహేందర్‌గౌడ్ ప్రతిపాదించగా అందరూ ఆమోదించారు. ఈపదవిని ఆశించిన నాలుగో వార్డు సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజ్‌కుమార్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఆర్‌ఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ శరణు బసప్పతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌ను సముదాయించడంతో అంతా ప్రశాంతంగా ముసిగింది.
సర్పంచ్, వార్డు సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు


