ఒకే నామినేషన్.. లాంఛనమే యునానిమస్
కుల్కచర్ల: మండలంలో రెండు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కానున్నాయి. మూడో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా తిర్మలాపూర్, బోట్యానాయక్ తండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఏకగ్రీవం లాంఛమైంది. తిర్మలాపూర్‌లో వార్ల మాధవి, బోట్యానాయక్‌తండాలో సంతోష్ సర్పంచులు అవ్వనున్నారు. ఎన్నికలు అధికారులు ప్రకటించాల్సి ఉంది. తిర్మలాపూర్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్వగ్రామం కావడం గమనార్హం.
రూప్‌సింగ్‌తండాలో..
పరిగి: మండలంలో ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. రూప్‌సింగ్‌తండాకు రమణిబాయి ఒక్కరే సర్పంచ్‌కి నామినేషన్ వేయడంతో ఆ స్థానం యునానిమస్ అయింది. మల్కాయాపేట, హిర్యనాయక్‌తండాలో అన్ని వార్డులు ఏకగ్రీవయ్యాయి. స్క్రూట్నీ అనంతరం అధికారింగా ప్రకటించనున్నారు.
ఒకే నామినేషన్.. లాంఛనమే యునానిమస్
ఒకే నామినేషన్.. లాంఛనమే యునానిమస్


