రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రెసా
అనంతగిరి: రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ అన్నారు. మంగళవారం ట్రెసా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పరిగి డీటీ విజయేందర్, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా దీపక్ సాంసన్‌దాస్, ఉపాధ్యక్షుడిగా ఎండీ నైమాత్ అలీ, విజయ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా మునీరుద్దీన్, కోశాధికారిగా మహ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆనంద్‌రావు, సురేశ్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రటరీగా నరేందర్, జాయింట్ సెక్రటరీలుగా షేక్ రషీద్ అహ్మద్, అజయ్‌కుమార్, ఎండీ ఖాజాపాషా, శిరీష, కార్యవర్గసభ్యులుగా సయ్యద్ అసద్ అలీ, శ్రీకాంత్, కనకారావు, మాధవరెడ్డి, వెంకటేశ్, నాగమణి, శశికళ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా నారాయణరెడ్డి, నిరంజన్, రాష్ట్ర కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, రాష్ట్ర నాయకులు బి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్


