ఇదేం భోజనం?
కుల్కచర్ల: ప్రభుత్వం వంట కార్మికులకు నిధులు పెంచి ఇస్తున్నా నాణ్యమైన భోజనం అందించకపోవడం బాధాకరమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. మంగళవారం చాపలగూడెంలో పర్యటించిన నేతలు ప్రా థమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట సిబ్బందికి నిధులు ఆలస్యంగా వస్తున్నప్పటి కీ వచ్చే నిధులను పెంచి ఇస్తున్నామన్నారు. చిన్నారులకు నీళ్లచారుతో అన్నం పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, వెంకటయ్య, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఏఎంసీ చైర్మన్ ఆగ్రహం


