నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక

Nov 25 2025 6:03 PM | Updated on Nov 25 2025 6:03 PM

నేడు

నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక

నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక దేవాదాయ భూములను ఆక్రమిస్తే చర్యలు జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

మోమిన్‌పేట: మండలంలో మంగళవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నందివాగు ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, దేవరంపల్లిలో రూ.47 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.18 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవన ప్రారంభోత్సవం, చక్రంపల్లిలో రూ.19 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవన ప్రారంభోత్సవం, రూ.56 లక్షలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనికార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనిత

పూడూరు: దేవాదాయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనిత హెచ్చరించారు. పరిగి పట్టణంలోని గోపాలస్వామి ఆలయానికి చెందిన భూములు పూడూరు మండలం చన్గోముల్‌ గ్రామంలో ఉన్నాయి. అట్టి భూములు ఆక్రమణకు గురైనట్లు ఇటీవల ఆ గ్రామ ప్రజలు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు గ్రామ సర్వే నంబర్‌లోని 14.21 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తహసీల్దార్‌ హరిత, జిల్లా సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఈఓ నరేందర్‌, గ్రామ పాలనాధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: జాతీయస్థాయి మల్లకంబ్‌ పోటీలకు బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన కీర్తన్‌, మహేష్‌, అఖిల్‌భరత్‌, హన్మంతులు ఈ నెల 15న నగరంలో జరిగిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు వెళ్లారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ లక్ష్మికాంత్‌ రెడ్డి, ఉపాధ్యాయ బృంధం అభినందించారు.

మొయినాబాద్‌: మున్సిపల్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలను వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ నెల 5వ తేదీలోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, నూతన యూనిఫాం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు, ఈఎస్‌ఐ కార్డు, పీఎఫ్‌ నంబర్‌ వంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌, మండల కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌, మున్సిపల్‌ గౌరవ అధ్యక్షుడు రత్నం, అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌ పాల్గొన్నారు.

నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక 
1
1/1

నేడు మోమిన్‌పేటకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement