ఎడ్యుకేషన్ హబ్ పనుల్లో వేగం పెంచాలి
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ శివారులో ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన స్థలాన్ని ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇందుకు కేటాయించిన 224.04 ఎకరాల స్థలానికి సంబందించిన హద్దులను, వివిధ విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్‌కు సంబందించిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అన్ని విద్యాలయాలకు కేటాయించిన స్థలాలు చూడాగానే గుర్తుండేలా జెండాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయభాస్కర్ రెడ్డి, డీఈఈ రాజయ్య, ఏఈలు విజయభాస్కర్ రెడ్డి, జనార్ధన మూర్తి పాల్గొన్నారు.
ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి


