అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది

Nov 25 2025 6:03 PM | Updated on Nov 25 2025 6:03 PM

అదృశ్

అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది

అనుమానాస్పద మృతిగా కేసు

పూడూరు: వారం క్రి తం అదృశ్యమైన వృద్ధురాలు ఓ పాడుబడిన ఇంటిలో శవమై తేలింది. ఈ ఘటన చన్గోముల్‌ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి రాములమ్మ(80) ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం గ్రామానికి చెందిన జలీల్‌మియాకు చెందిన పాడుబడిన ఇంటి నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు వెళ్లి పరిశీలించగా ఓ గోనె సంచి మూట కనిపించింది. అది విప్పి చూడగా తప్పిపోయిన రాములమ్మ మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన తల్లిమృతిపై అనుమానం ఉందని కుమారుడు పోలీసలుకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

మోసం చేసిన వారిపై కేసు

ఇబ్రహీంపట్నం రూరల్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్‌ తెలిపారు. కుర్మల్‌గూడకు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్‌కుమార్‌ 36 మంది వద్ద ప్లాట్లు ఇప్పిస్తామని మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. సోమవారం ఈ మేరకు విచారణ చేపట్టి ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

మొయినాబాద్‌: వ్యక్తిగత కారణాలతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మున్సిపల్‌ కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండలం వెంకన్నగూడకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ సోలిపేట సాయికుమార్‌ మున్సిపల్‌ కేంద్రంలోని గుల్షన్‌ కాలనీలో ఇళ్లు నిర్మించుకుని భార్య నిర్మల(28), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. సాయికుమార్‌ సైబరాబాద్‌ హెడ్‌ క్వాటర్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం మధ్యా హ్నం 3గంటలకు నిర్మల తల్లి యాదమ్మ కూతు రు ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో పెద్దగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు సూసైట్‌ నోట్‌ లభించింది. నా చావుకు ఎవరూ కారణం కాదు. వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నా.. అంటూ రాసి ఉంది. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌ లోన్‌ వేధింపులకు యువకుడి బలి

ఇబ్రహీంపట్నం: ఆన్‌లైన్‌ లోన్‌ నిర్వాహకులు పెట్టే వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ చందర్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దండుమైలారం గ్రామానికి చెందిన అచ్చిన నవీన్‌(23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని సిలింగ్‌ హుక్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికే అతని సోదరి గుర్తించి ఇరుగుపొరుగు వారికి, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కిందికి దించారు. అప్పటికే నవీన్‌ మృతి చెందినట్లు గుర్తించారు. అతని మొబైల్‌ పరిశీలించగా ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకున్నాడని.. దీంతో లోన్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేసే సందేశాలు పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చందర్‌సింగ్‌ తెలిపారు.

అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది 1
1/1

అదృశ్యమైన వృద్ధురాలు.. శవమై తేలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement